Ankitha:లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి అంకిత. ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమా ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఇందులో కస్తూరి పాత్రలో నటించి అంకితం మెప్పించారు. ముఖ్యంగా ఇందులో మరింత గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన అంకిత అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి అంకిత ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే… సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా స్వస్తి పలికారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి అంకిత వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఈమె 2016 వ సంవత్సరంలో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికా న్యూ జెర్సీలో స్థిరపడ్డారు. ఇలా విదేశాలలో ఉన్నటువంటి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం తన భర్త ఇద్దరు అబ్బాయిలతో ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
Ankitha:అమెరికాలో స్థిరపడిన నటి
చాలా రోజుల తర్వాత ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్పటికి ఇప్పటికీ అంకితలో ఏమాత్రం మార్పు లేదని ఈమె తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.అయితే ఇప్పటికే పలువురు హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. మరి వారిలాగే అంకిత కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా లేదా నటనకు దూరంగా ఉంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది.