Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం ఇప్పటికే 8 వారాలను పూర్తి చేసుకున్న తొమ్మిదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక తొమ్మిదవ వారంలో భాగంగా నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తికాగా ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ఇక ఈవారం నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్ అమర్ దీప్ చాలా హైలైట్ అయ్యారని చెప్పాలి. ఇక ఓటింగ్ పరంగా కూడా ఈయన భారీ స్థాయిలో ఓట్స్ సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా 9వ వారం ఎలిమినేషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
ఈవారం ఇప్పటివరకు పోలైన ఓట్లు కనక చూస్తే డేంజర్ పొజిషన్లో శోభ శెట్టి ఉన్నారని తెలుస్తుంది. ఈమె నిజానికి రెండు వారాల క్రితమే హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా ఒక వారం పూజా మూర్తి బయటకు వెళ్లారు మరొక వారం సందీప్ మాస్టర్ బయటకు వెళ్తూ ఈమె సేవ్ అయ్యారు. కానీ ఈ వారం మాత్రం పక్క శోభ ఎలిమినేట్ అవుతుంది అంటూ స్పష్టంగా అర్థం అవుతుంది కూడా తెలియడంతో ఆమె కూడా ఈ వారం మొత్తం కాస్త డల్ అయిందని తెలుస్తుంది.
డబల్ ఎలిమినేషన్…
ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో శోభశెట్టితో పాటు మరొక స్ట్రాంగ్ అంటిస్టెంట్ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శోభ శెట్టితో పాటు మరొక కంటెస్టెంట్ అయినటువంటి టేస్టీ తేజ కూడా ఓటింగ్ పరంగా డేంజర్ జోన్ లోనే ఉన్నారు కనుక ఈయన కూడా ఈ వారం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రతిక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లడంతో డబుల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా ఉంటుంది. మరి ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని శోభ శెట్టితో పాటు టేస్టీ తేజ కూడా బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.