Anu Emmanuel: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నటి అను ఇమ్మానియేల్ గురించి అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో వరుస ఆఫర్లతో బాగా గుర్తింపు పొందింది. తొలిసారిగా ఈ బ్యూటీ 2011లో స్వప్న సంచారి అనే మలయాళం సినిమా లో బాలనటిగా పరిచయం అయ్యి.. ఆ తర్వాత యక్షన్ హీరో బిజు అనే సినిమా లో హీరోయిన్ గా తెరకెక్కింది.
ఇక 2016 మజ్ను సినిమాతో తెలుగులో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత వరుస సినిమాలలో నటించినప్పటికీ ఎందుకో అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఆయన కూడా బాగా అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఇక గతంలో ఈమె ఒక ప్రేమ వ్యవహారంలో బాగా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా హీరో అల్లు శిరీష్ తో కూడా డేటింగ్ లో ఉందని బాగా పుకార్లు వచ్చాయి.
అయితే తాజాగా దీని గురించి ఒక విషయాన్ని బయట పెట్టింది. ఈరోజు తను, శిరీష్ కలిసి జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అను తన గురించి చాలా విషయాలు పంచుకుంది. అంతే కాకుండా శిరీష్ తో తనకున్న సంబంధం గురించి కూడా తెలిపింది
తను, శిరీష్ డేటింగ్ లో ఉన్నామన్న గాసిప్ లు చాలా వచ్చాయని.. ఇక తన తల్లి ఆ వార్తలు విని చాలా బాధపడిందని తెలిపింది. దాంతో తను కూడా బాధపడాల్సి వచ్చిందని తెలిపింది. అయితే ఊర్వశివో రాక్షసివో సినిమాకు ముందు తను ఎప్పుడు శిరీష్ ని కలవలేదట. పూజ రోజున కలవడమే మొదటిసారట. డైరెక్టర్ కథ మొత్తం చెప్పిన తర్వాత తాను, శిరీష్ కాఫీ షాప్‌లో కూర్చుని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నారట.
Anu Emmanuel: చివరికి అల్లు అరవింద్ కూడా అడిగాడట..
ఇక తమ మధ్య స్నేహం ఉంది కానీ డేటింగ్ చేసే చనువు అంత ఎఫెక్షన్ లేదని తెలిపింది. ఇక బన్నీతో నా పేరు సూర్య సినిమా చేసినప్పటి నుంచీ అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నది. ఇక శిరీష్‌తో డేటింగ్ అన్న విషయం గురించి అరవింద్ తనను కూడా అడిగారట. చివరికి అది గాసిప్ అని ఇద్దరు నవ్వుకున్నారట.