Anuemmanuel: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ సైతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ ఇదివరకే మీడియా ముందు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా నటి అను ఇమ్మానియేల్ సైతం కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించారు. మలయాళీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె తెలుగులో నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు మాత్రం పెద్దగా అవకాశాలు విజయాలు వరించలేదని చెప్పాలి. చివరిగా తెలుగులో ఊర్వశివో రాక్షశివో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇకపోతే తాజాగా ఈమె జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Anuemmanuel:
ఈ సందర్భంగా అను మాట్లాడుతూ తాను కూడా కెరియర్ మొదట్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. అయితే తన కుటుంబం సహాయంతో ఇలాంటి ఇబ్బందులను ఫేస్ చేయగలిగి ఎదుర్కొన్నానని ఇలాంటి సందర్భాలలో కుటుంబం అవసరం ఎంతో ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఇలా కెరియర్ మొదట్లో తనని కూడా కొందరు ఇలాంటి కోరికలతో చాలా ఇబ్బంది పెట్టారని అయితే ధైర్యంతో ఎదుర్కొంటే ఇలాంటి సమస్యలు మన దరికి చేరవని అను ఇమ్మానియేల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.