Anupama: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనుపమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుపమ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా అనుపమ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్ సరసన అనుపమ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బంధం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పలు ఆసక్తికర విషయాలను చూపుకొచ్చింది.
ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. శర్వానంద్, అనుపమ కలిసిన చిత్రం శతమానం భవతి. ఈ సినిమా విడుదల రోజున ఈ సినిమాను చూడకుండా వీరిద్దరూ కలిసి వేరే సినిమాను చూశారట. ఆరోజు రాత్రి శర్వానంద్ అనుపమ ఇద్దరూ కలసి ఆ సినిమాను చూసి వచ్చారట. ఆ సినిమా మరేదో కాదు మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150. అయితే ఆరోజు వాళ్ళిద్దరూ నటించిన శతమానం భవతి సినిమా రిలీజ్ అయినప్పటికీ చిరంజీవి మీద ఉన్న క్యూరియాసిజితో ఆ సినిమాకు వెళ్లారట. తనకి ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి అని, తాను థియేటర్ లో చూసిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150 అని చెప్పుకొచ్చింది అనుపమ.
Anupama: శర్వానంద్ కి ఇష్టం అని వెళ్ళాము..
శతమానం భవతి సినిమా విడుదల రోజున శర్వానంద్ తో కలిసి ఆ రోజు రాత్రి సినిమాకు వెళ్లాను అని తెలిపింది అనుపమ. శర్వానంద్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం కాబట్టి వెళ్ళాము అని తెలిపింది అనుపమ. అయితే వారితో పాటుగా ఆరోజు అనుపమ తల్లి కూడా ఉన్నారట. కాగా 2017 జనవరి 14న శతమానం భవతి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అదే ఏడాది జనవరి 11న ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల అయింది. మొత్తానికి అనుపమ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.