Anushka Shetty: సగం వయస్సు ఉన్న వ్యక్తితో ప్రేమలో పడిన అనుష్క.. పెళ్లి కూడా ఫీక్స్?

Akashavani

Anushka Shetty:  తెలుగు ప్రేక్షకులకు అనుష్క గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన నాగార్జున సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ పై పలు సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.

ఇక బాహుబలి సిరిస్ ద్వారా అనుష్క క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోయింది. ఇక ఇండస్ట్రీలో అలా ఒక వెలుగు వెలిగిన అనుష్క గత రెండేళ్లుగా ఇండస్ట్రీకు దూరంగా ఉంటుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా అరుదుగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ గరిట తిప్పే పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఆ సినిమా టైటిల్ విషయానికి వస్తే.. మిస్టర్ అండ్ మిసెస్ శెట్టి అనే ఒక టైటిల్ ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతుంది. అంతేకాకుండా ఆ సినిమాలో ఆమె తన వయసులో సగం వయసు ఉన్న వ్యక్తితో ప్రేమ లో పడుతుందట. ఇక ఆ సినిమాలో అనుష్కది చెఫ్ రోల్ అన్నట్లు తెలుస్తుంది.

అనుష్క తనలోని నటనా సామర్థ్యాన్ని బయటపెట్టడానికి ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె చెఫ్ రోల్ చేయడానికి ఎంతో ఆనందంగా యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Anushka Shetty: సగం వయస్సు ఉన్న వ్యక్తితో ప్రేమలో పడిన అనుష్క.. పెళ్లి కూడా ఫీక్స్?
Anushka Shetty: సగం వయస్సు ఉన్న వ్యక్తితో ప్రేమలో పడిన అనుష్క.. పెళ్లి కూడా ఫీక్స్?

Anushka Shetty: అనుష్క చేసే కొత్త సినిమాలో హీరో ఇతడే!

ఇక సినిమాలో హీరో విషయానికొస్తే.. నవీన్ పోలిశెట్టి అని తెలుస్తుంది. ఆ సినిమాలో అతడు స్టాండప్ కమీడియన్ గా మారాలని కోరుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అనుష్క నవీన్ పోలిశెట్టి కాంబోలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అనుష్క అతడిని ప్రేమించగా.. పెళ్లి చేసుకుంటుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

- Advertisement -