Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అనుష్క గురించి తెలియని తెలుగు ప్రేక్షకులే లేరు అని చెప్పాలి. ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటన పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన అందంతో కూడా ఎంతోమంది కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది. అయితే గత కొన్ని రోజుల నుండి అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా కనిపించట్లేదు.
పైగా అవకాశాలు కూడా అంతగా రావట్లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ తాను మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలిచిపోయింది. ఇక ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది అనుష్క. అయితే గతంలో అనుష్క, ప్రభాస్ రిలేషన్ లో ఉన్నారు అని వారిద్దరు పెళ్లి చేసుకుంటారు అని బాగా వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య అటువంటిదేమీ లేదు అని కేవలం స్నేహం మాత్రమే ఉందని తెలిపారు.
అయినా కూడా ప్రేక్షకులు ఇప్పటికి వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా ఉండకపోయేసరికి వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుంది అని అనుకుంటున్నారు. ఇక వీరిద్దరు కలిసి పలు సినిమాలలో చేశారు. అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ బాహుబలి లో కూడా వీరిద్దరు జంటగా నటించారు.ఇక ఈ సినిమా ప్రభాస్ తలరాతను మొత్తం మార్చేసింది. కానీ అనుష్కకు మాత్రం మళ్లీ అంతటి సక్సెస్ వచ్చే సినిమాలు రాలేకపోయాయి. అయితే అనుష్క బాహుబలి సినిమాలో నటించడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.
ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. అదేంటంటే ఈ సినిమా స్టోరీ నచ్చి అనుష్క సినిమా చేయలేదు అని.. కేవలం ప్రభాస్ కోసమే ఈ సినిమా ఒప్పుకుంది అని తెలిపాడు. గతంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేశావు అని రాజమౌళి అనుష్కను అడిగాడట.

Anushka:
దాంతో అనుష్క.. రమా రాజమౌళి, వల్లి, కీరవాణి, ప్రభాస్ వీళ్ళందరూ తన క్లోజ్ ఫ్రెండ్స్ అని.. అంతేకాకుండా షూటింగును వీళ్ళందరూ ఒక టూర్ లాగా, పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఎలా తట్టుకుంటాను అని.. అందుకే ఈ సినిమా యాక్సెప్ట్ చేశాను అని అన్నదట. దాంతో రాజమౌళి అప్పుడే తనకు అర్థమైంది అని.. తాను ఈ స్టోరీ విని ఓకే చేయలేదు అని.. కేవలం ప్రభాస్ తో కలిసి షూటింగ్లో ఎంజాయ్ చేయటానికి మాత్రమే నటించిందని తెలిపాడు.