Anushka: అనుష్క తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనుష్క బాహుబలి సినిమా తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు.నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అనుష్క అనంతరం ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ సరసన నటించి మెప్పించారు.ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు.
ఇలా మూడు సంవత్సరాలు తర్వాత ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా నవీన్ పోలిశెట్టి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా అనుష్కకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Anushka: గోర్లను మొత్తం కొరికేస్తారు…
అనుష్కస్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ ఈమెకు ఒక భయంకరమైన చెడ్డ అలవాటు ఉందట.ఈమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ అలవాటు మాత్రం మానుకోలేకపోతున్నారని తెలుస్తుంది. మరి ఎంతో స్వీట్ గా ఉండే ఈ స్వీటీకి ఉన్నటువంటి ఆ చెడ్డ అలవాటు ఏంటి అనే విషయానికి వస్తే ఈమెకు ఏదైనా కంగారు ఉన్నప్పుడు లేదా దేని గురించి అయినా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఈమె చేతి వేళ్ళు తనకు తెలియకుండానే నోట్లోకి వెళ్లిపోయి గోర్లను కొరుకుతూనే ఉంటారట.ఇలా ఈ అలవాటు మానుకోవడానికి అనుష్క ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు కంగారు వచ్చిందంటే గోర్లను మొత్తం కొరికేస్తారు. అంటూ ఈమెకు ఉన్నటువంటి ఈ అలవాటు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.