AR Rahmam: చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా
భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలోని ఉత్తమమైన సినిమాలకు ఈ ఆస్కార్ అవార్డు అందజేస్తారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడికి నటుడికి ఈ అవార్డు అందుకోవాలని ఆశ ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రమే ఈ అవార్డు వరిస్తుంది. తాజాగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో మన తెలుగు సినిమా మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు అందుకోవటంతో తెలుగు ప్రజలు గర్వంగా భావిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వరించింది. ఇలా రాజమౌళి మన తెలుగు సినిమా గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డులపై తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డ్ లభించిన ఆనందంలో ఉండగా రెహమాన్ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ తో ఆస్కార్ అవార్డు గురించి ప్రస్తావించగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
AR Rahmam: కొన్ని సినిమాలకు అన్యాయం జరుగుతుంది…
ఈ ఇంటర్వ్యు లో రెహమాన్ మాట్లాడుతూ…” అర్హత లేని చాలా సినిమాలని ఆస్కార్ కు పంపిస్తున్నారని, దీని వల్ల అర్హత ఉన్న సినిమాలకు అన్యాయం జరిగిపోతుందని తెలిపాడు. కొన్ని సందర్భాల్లో మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్తాయని అనుకుంటాను. కానీ అవి అంతవరకు వెళ్లవు. అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారు. దీంతో నేను ఏం చేయలని స్థితిలో ఉంటున్నాను.’ అంటూ రెహమాన్ తన బాధని బయటపెట్టారు. అయితే భారత్ నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్ ఆర్ ని ఆస్కార్ కు కాదని గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ని పంపించారు. కానీ అది కనీసం నామినేషన్స్ వరకు కూడా వెళ్లలేకపోయింది. కానీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కు పంపకపోయినా సరే తమ వంతు ప్రయత్నం చేసి నామినేషన్స్ లో నిలిచి అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఏ ఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.