Ariyana Glory: యూట్యూబ్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అరియనా గ్లోరీ ఒకరు.ఈమె యూట్యూబ్ యాంకర్ గా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ గుర్తింపు పొందారు. ఇదే గుర్తింపుతో ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె అనంతరం బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరించారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అరియనా ప్రస్తుతం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే బీబీ జోడీలో ముక్కు అవినాష్ తో కలిసి ఈమె సందడి చేస్తున్నారు. ఇలా కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న అరియనా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
Ariyana Glory:సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్…
ఈ క్రమంలోని తాజాగా ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి ఒక షోలో డాన్స్ చేయడం కోసం బాలీవుడ్ పాటకు రిహార్సల్స్ చేస్తున్నారు. అయితే రిహార్సల్స్ చేస్తున్నటువంటి ఫోటోలను, వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో ఈమె చాలా హాట్ గా కనిపిస్తున్నారు. టైట్ డ్రెస్ ధరించి టీ షర్ట్ పైకి కట్టి నాభి అందాలు కనపడేలా డాన్స్ చేస్తూ రచ్చ చేశారు. షారుఖ్ ఖాన్ దీపికా పదుకొనే నటించిన పఠాన్ చిత్రంలోని బేషరమ్ అనే పాటకు డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. ఇక ఈ పాట ఎలా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. అరియనా సైతం ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజన్స్ ఇక్కడ డాన్స్ ఎక్కడుంది ఎక్స్పోజింగ్ తప్ప అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈమెను ఎంకరేజ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.