Ariyana Glory సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో చాలామంది జీవితాలు రాత్రికి రాత్రి మారిపోతుంటాయి. ఈ క్రమంలో ఒక్క సినిమా లేదా ఇంటర్వ్యూ అలాగే ఒక్క ఆఫర్ వంటివాటితో రాత్రికి రాత్రే పాపులర్ అయినటువంటి నటీనటులు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. ఇలా పాపులర్ అయినవాళ్ళలో తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ అరియనా గ్లోరీ ఒకరు. కాగా అప్పట్లో ఈ అమ్మడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో జరిగిన ఓ ఇంటర్వ్యూ కారణంగా రాత్రికిరాత్రే పాపులర్ అయిపోయింది.
అయితే ఈ ఇంటర్వ్యు లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా అరియనా గ్లోరీ ని బికినీ దుస్తులలో చూడాలని ఉందని చెప్పడం తో ఒక్కసారిగా ఈ ఇంటర్వ్యూ కాస్త బలంగా వైరల్ అయింది. దాంతో నటిజెన్లు కూడా అరియనా గ్లోరీ గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో వెతకడం, దీంతో తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయిన బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో ఆఫర్ రావడం వంటివి చకచకా జరిగిపోయాయి.
దీంతో యాంకర్ హర్యానా గ్లోరీ సినీ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. కొన్ని రోజులపాటు వరసగా పలు రకాల షోలు, ఈవెంట్లు అంటూ బిజీబిజీగా గడిపింది. అంతేకాకుండా లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం అరియనా గ్లోరీ కి టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ కమెడియన్ తో ప్రేమాయణం నడుస్తోందని అప్పట్లో పుకార్లు కూడా వినిపించాయి. కానీ చివరికి ఆ కమేడియన్ కాస్త ఇటీవలే వేరే యువతి ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. దీంతో అరియనా గ్లోరీ విషయంలో వినిపించిన వార్తలన్నీ వట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చింది.
అయితే ఈ మధ్యకాలంలో నటి అరియనా గ్లోరీ షోలు, ఈవెంట్లు తప్ప సినిమా ఆఫర్లపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ షో తో వచ్చిన ఫేమ్ తో ప్రస్తుతం షోలు, ఈవెంట్లు అంటూ ఏదో అలా నెట్టుకొస్తోంది. కానీ ఈ షోలు, ఈవెంట్ల ఆఫర్లు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మాత్రం పెద్దగా వర్కౌట్ కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు. అంతేకాకుండా సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్ల కోసం ప్రయత్నిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని అలాగే వయసులో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారిస్తే అంత ఇంతో గుర్తింపు దక్కుతుందని మరికొందరు అంటున్నారు.
అయితే యాంకర్ అరియనా గ్లోరీ ఈ మధ్యకాలంలో ఫోటోషూట్లలో పాల్గొంటూ బాగానే అందాలు ఆరబోస్తున్నప్పటికీ ఆఫర్ల విషయంలో మాత్రం పెద్దగా కలిసి రావడం లేదని తెలుస్తోంది.