Artist Siri: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సిరి హన్మంత్ బాగా పరిచయమని చెప్పాలి. ఈమె యాంకర్ గా, నటిగా కంటే బిగ్ బాస్ హౌస్ లో తన పరిచయాన్ని పెంచుకుంది. ఈమె తొలిసారిగా తన కెరీర్ ను యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లలో కూడా నటించింది. బుల్లితెర పైనే కాకుండా యూట్యూబ్ లలో కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరిస్ లు కూడా చేసింది.
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా కనిపిస్తుంది. ఈమె మరో ఆర్టిస్ట్ శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అతడు కూడా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఇక సిరి హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్, యూట్యూబర్ షణ్ముఖ్ తో ఫ్రెండ్షిప్ అనే పేరుతో హగ్గులు, కిస్ లు ఇచ్చి బాగా రచ్చ చేసి నెగెటివిటీ సంపాదించుకుంది. దీంతో అందరూ తనపై బాగా ఫైర్ అయ్యారు. అప్పటికే ఆమె శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె అలా ప్రవర్తించడంతో అందరూ తనని ద్వేషించుకున్నారు. ఇప్పటికీ ఆమె అంటే అంత అభిమానం చూపించలేకపోతున్నారు జనాలు.
అయితే గతంలో తను చేసిన తప్పు గురించి బిగ్ బాస్ వేదికపై తెలుపగా.. మరోసారి తను చేసిన తప్పు గురించి తెలుసుకొని ఎమోషనల్ అయింది. త్వరలో ప్రేమికుల రోజు రానున్న సందర్భంగా స్టార్ మా లవ్ టుడే అని ఈవెంట్ ని నిర్వహించింది. ఇక అందులో రీల్ కపుల్స్, రియల్ కపుల్స్ వచ్చి బాగా సందడి చేశారు. ఇక అందులో సిరి, శ్రీహాన్ కూడా పాల్గొన్నారు.
Artist Siri:
ఇక సిరి శ్రీహాన్ ను పలు రకాలుగా సర్ప్రైజ్ చేసింది. అది చూసి శ్రీహాన్ చాలా మురిసిపోయాడు. ఇక సిరి మాట్లాడుతూ.. చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు కానీ అవి స్టేజిపై చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు అంటూ తను కూడా తెలిసి తెలియక తప్పులు చేశాను అని బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. దాంతో శ్రీహాన్ వెంటనే తనను పట్టుకొని ఓదార్చాడు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.