Ashish Vidyarthi: తెలుగు తమిళ్ వంటి ఎన్నో భాషలలో విలన్ పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను భయపెట్టే విలన్ గా మాత్రమే కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆశిష్ విద్యార్థి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల రెండవ పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ మరొకసారి వార్తల్లో నిలిచాడు. 60 ఏళ్ల వయసులో 33 ఏళ్ల రూపాలీ బరువా అనే మహిళా వ్యాపారవేత్తను ఇటీవల ఆశిష్ రెండవ వివాహం చేసుకున్నాడు. తాజాగా ఆశిష్ మొదటిసారిగా తన రెండవ వివాహం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ రెండవ పెళ్లి జరగటానికి ముందు తాను పడ్డ బాధ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” గతేడాది వ్లాగింగ్ అసైన్‌మెంట్‌లలో భాగంగా నేను రూపాలిని కలిశా. ఆ తర్వాత మా మధ్య పరిచయం ఏర్పడి ఒకరితో ఒకరు చాట్ చేయడం ప్రారంభించాం. రూపాలీ కూడా ఐదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయింది. ఆమె ఆ బాధనుండి బయటపడగలిగింది. ఇద్దరి మధ్య పరిచయం పెరగటంతో మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి ఇద్దరం ఆలోచించాం. రెండవ పెళ్లి చేసుకుని ఇద్దరం మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము అంటూ ఆశిష్ తెలిపాడు.
Ashish Vidyarthi: కుటుంబ సభ్యులను బాధపెట్టాను…
ఇప్పుడు ఆమె జీవితంలో నేను ఉన్నందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే రూపాలీతో రెండవ వివాహం అందరూ అనుకున్నంత సులభంగా జరగలేదు. ఈ రెండవ పెళ్లి నిర్ణయం ఆమె కుటుంబాన్ని చాలా బాధించింది. నా భార్య పిలూ కూడా మా పెళ్ళికి అభ్యంతరం తెలపలేదు. ‘పిలూతో పెళ్లి తర్వాత మా జీవితం అద్భుతంగా సాగింది. ఆమె నాకు భార్య మాత్రమే కాదు ఫ్రెండ్ కూడా. అందువల్ల ఇద్దరం విడిపోవడం చాలా బాధ కలిగించింది. ఈ విషయంలో మేమిద్దరం చాలా ఫీలయ్యాం.’ అని రెండో పెళ్లి చేసుకోవటానికి వెనుక తాను పడ్డ బాధ గురించి చెప్పుకొచ్చాడు.