Ashish Vidyarthi: ఆశిష్ విద్యార్థి పరిచయం అవసరం లేని పేరు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో ఈయన విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా విలన్ పాత్రలలో పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఆరు పదుల వయసులో పెళ్ళికొడుకు గా మారి అందరికీ షాక్ ఇచ్చారు. 60 సంవత్సరాల వయసులో ఆశిష్ విద్యార్థి రెండవ పెళ్లి చేసుకోవడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. అయితే ఇంతకీ ఆశిష్ విద్యార్థి చేసుకున్న ఈ రూపాలి ఎవరు ఏంటి అనే విషయాల గురించి ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రేమకు పెళ్లికి వయసు అడ్డురాదంటూ లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఆశిష్ విద్యార్థి సైతం 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈయన పెళ్లి చేసుకున్న ఈమె ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే… రూపాలీ బరువ గౌహతికి చెందిన ఒక మహిళా. ఈమెకు కోల్ కోల్ కత్తా లోని ఒక ఫ్యాషన్ స్టోర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గతకొంతకాలంగా ఆశిష్ విద్యార్థితో ప్రేమలో ఉన్న రూపాలి తాజాగా తనని స్నేహితులు బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ashish Vidyarthi: ఫ్యాషన్ ప్రెన్యూయర్…
ఇకపోతే ఆశిష్ విద్యార్థి ఇదివరకే నటి శకుంతల బారువా కూతురు రాజోషి బారువని పెళ్లి చేసుకోగా.. వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. ఇలా కొడుకు పుట్టిన తర్వాత తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరికీ మనస్పర్థలు రావడం చేతనే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నటువంటి ఈయన 60 సంవత్సరాల వయసులో తిరిగి రూపాలి అనే మహిళను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.