Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సెలబ్రీటీలుగా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే అలా చాలామంది సోషల్ మీడియా ద్వారా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను బయట పెట్టగా అందులో మరో సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి ఒకరు అని చెప్పాలి. ప్రస్తుతం బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుందనే చెప్పాలి.
ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది. ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది. డబ్స్మాష్ వీడియోలతో తొలిసారిగా నెటిజన్లను ఆకట్టుకుంది అషూ రెడ్డి.
ఇందులో సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు సంపాదించుకుంది. అలా ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది. అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని తన పరిచయాన్ని బాగా పెంచుకుంది. ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది. ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.
ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది. ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అనుకున్నారు. పైగా గతంలో హరి అషూ పేరు టాట్టూ వేయించుకొని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Ashu Reddy: ఛాతి పై వేసుకున్న టాటూను చూపించిన అషూ..
ఇక తాజాగా తన పేరుతో ఛాతిపై వేసుకున్న టాటూను ఇప్పుడు చూపించిన వీడియోను తన ఇన్ స్టాలో పంచుకుంది. హరి తన పేరును టాటూ వేసుకున్న విషయాన్ని మరోసారి పంచుకుంది. అంతేకాకుండా అభిమానం అంటే ఇదే అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఇప్పటికి నెటిజన్లు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు. ఇక ఈ ప్రేమలు చూడలేక పోతున్నాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.