Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ బ్యూటీ
అషు రెడ్డి ఒకరు.ఇలా జూనియర్ సమంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు. ఇలా స్కిన్ షో చేస్తూ ఫోటో షూట్ లు చేయించుకోవడంతో ఈమె పెద్ద ఎత్తున నేటిజెన్ల ట్రోలింగ్ కు గురి అయ్యేవారు. ఈ విధంగా అషు రెడ్డి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచేవారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఆగ్రా వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇలా ఆగ్రాలోని తాజ్ మహల్ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక ఆగ్రముందు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్.ఇక తాజ్ మహల్ ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజ్ మహల్ దర్శించుకున్న తర్వాత అషు రెడ్డి తనకు ఎలాంటి ప్రియుడు కావాలో తన మనసులో ఉన్న కోరికను ఈ సందర్భంగా బయటపెట్టారు.
Ashu Reddy: అలాంటి లవర్ కావాలి..
ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ షాజహాన్ నాకు మీలాంటి ప్రేమికుడు కావాలి. మీలాంటి ప్రేమికుడు దొరకాలని ఆశీర్వదించండి అంటూ ఈమె షాజహాన్ ను కోరిక కోరారు. ఈ విధంగా ఈమె తన ప్రియుడు ఎలా ఉండాలో ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ముంతాజ్ ను షాజహాన్ ఎలా అయితే ప్రేమించారో తనని కూడా అలా ప్రేమించే ప్రియుడు కావాలి అంటూ ఈమె తనకు కాబోయే లవర్ గురించి తెలియజేశారు. దీంతో ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై యధావిధిగా కామెంట్లు చేస్తూ రెచ్చిపోయారు. ప్రస్తుతం
అషు రెడ్డి షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.