Ashu Reddy: బుల్లితెర ఆర్టిస్ట్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెర పై ఓ రేంజ్ లో దూసుకెళుతోంది. అంతేకాకుండా వెండితెరపై కూడా బాగా అవకాశాలు అందుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో పరిచయమైన అషూ జూనియర్ సమంతగా గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత వెండితెరపై ఓ సినిమాలో అవకాశం అందుకుంది. ఇక రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నది. బిగ్ బాస్ తర్వాత నుంచి ఈ అమ్మడి రేంజ్ మొత్తం మారిపోయింది. వరుసగా పలు షో లలో బాగా బిజీగా మారింది.
అంతేకాకుండా ఇటీవలే ముగిసిన నాన్ స్టాప్ బిగ్ బాస్ సీజన్లో కూడా పాల్గొని ఫినాలే కు ముందు ఎలిమినేట్ అయింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మళ్లీ తనకు పోస్టులతో హడావుడి చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది. ఇక ఆ వీడియో తో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది అషూ రెడ్డి.
అషూ తన ఇన్ స్టా రీల్ వీడియో చేయగా.. అందులో ఒక సినిమా డైలాగు కొట్టింది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ.. నాకే గాని స్వయంవరం పెడితే.. ఎంత మంది రాజులు గుర్రాలు వేసుకొని వచ్చేవాళ్ళు తెలుసా అంటూ డైలాగ్ కొట్టింది. దాంతో అక్కడే తన పక్కన కూర్చున్న అబ్బాయి తన నెత్తిపై ఒక మొట్టికాయ వేశాడు.

Ashu Reddy: నెటిజన్లతో దారుణమైన కామెంట్లు ఎదుర్కొన్న అషూ రెడ్డి..
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఫస్ట్ మేకప్ తీసి రీల్స్ చేయు అని.. మరొకరు.. గుర్రాలు కాదు కదా గాడిద కూడా రావు అని కామెంట్లు పెట్టారు. ఇక ఓ నెటిజన్ ఫస్ట్ స్నానం చేయు వాసన వస్తుంది అని కామెంట్ పెట్టాడు.