నా కష్ట సమయంలో మహేష్ బాబు, నమ్రత నన్ను ఆదుకున్నారు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్!

Akashavani

Adavi Shesh: నీ లవర్స్ కి హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. కర్మ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అడవి శేష్ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు. ఇక తన నటనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తొలి సినిమాతోనే అద్భుతమైన సక్సెస్ ను తన సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత గూడచారి సినిమాలో తన అద్భుతమైన నటన తో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతోనే అడపదడప కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే అడవి శేష్ శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న మేజర్ చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ముంబైలో టెర్రర్ ఎటాక్ లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ నేపథ్యం లో నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాత గా వహిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ఆ ఈవెంట్లో హీరో అడవి శేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మాన్ అని తెలిపాడు. మనందరి లైఫ్ లాగే తన లైఫ్ కూడా సాధారణంగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Adavi Shesh: శేష్ కు మహేష్ నమ్రత లు ఈ సమయంలో తోడు ఉన్నారు!

ఇక అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక సాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారు అనేది ఈ సినిమాల్లో చూపిస్తారు అని అడవి శేష్ తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాకు మహేష్ బాబు బ్యాక్ బోన్ అని చెప్పుకొచ్చాడు. ఏం జరిగినా మహేష్ గారు ఉన్నారని నమ్మకం ఉందని తెలిపాడు. ఇక కోవిడ్ లాంటి కష్ట సమయాల్లో మహేష్ నమ్రత లు తనకు అండగా నిలబడ్డారు అని అడవి శేష్ వెల్లడించాడు.

- Advertisement -