Auto Ram Prasad: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో ఇది వరకు ఎంతోమంది కంటెస్టెంట్ లు పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం పలు కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిన ఎంతో మంది కమెడియన్స్ ప్రస్తుతం వేరే ఛానల్లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి వీరి ముగ్గురు జబర్దస్త్ లో ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇకపోతే గత కొద్దిరోజుల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను కనిపించడం లేదు.ఇలా వీరిద్దరూ ఈ కార్యక్రమంలో కనిపించకపోయేసరికి చాలామంది ఎన్నో రకాల సందేహాలను వ్యక్తపరిచారు.కొందరు మల్లెమాల వారితో గొడవ వల్ల వీరిద్దరు బయటకు వెళ్లారు అంటూ కామెంట్లు చేయడం మరికొందరు వీరికి సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పారు అంటూ సందేహాలను వ్యక్తపరిచారు. అయితే ఇప్పటికీ వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి కారణం ఏంటో తెలియడం లేదు.

Auto Ram Prasad: మల్లెమాల వారితో ఉన్న అనుబంధమే కారణమా…
ముగ్గురు ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ వీరి లో గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ కి మాత్రమే సినిమా అవకాశాలు వచ్చి ఆటో రాంప్రసాద్ కి రాకపోవడం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. నటన పరంగా ఆటో రాంప్రసాద్ ఎంతో అద్భుతంగా నటిస్తారు అదేవిధంగా ఈయన మంచి రైటర్ గా పేరు సంపాదించారు. ఇంత టాలెంట్ ఉన్నటువంటి ఈయనకు సినిమా అవకాశాలు రాకపోవడం ఏంటి అని కొత్త సందేహాలను బయట పెడుతున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం సుడిగాలి సుధీర్ గెటప్ శీను బయటకు వెళ్ళిపోయి ఆటో రాంప్రసాద్ అక్కడే ఉండడానికి గల కారణం..జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆటో రాంప్రసాద్ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల ఆయన వల్లే ఆటో రాంప్రసాద్ ఇప్పటికీ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నారని,మల్లెమాల వారితో ఆటో రాంప్రసాద్ కు ఉన్న అనుబంధం కారణంగానే ఆయన ఇప్పటికీ ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారని తెలుస్తోంది.సుధీర్ గెటప్ శీను వెళ్లిపోవడంతో ఆటో రాంప్రసాద్ టీం లీడర్ గా ప్రస్తుతం ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.