Avinash: జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చిన తరువాత జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నప్పటికీ.. మాటీవీలో ప్రసారమవుతున్న అన్ని కామెడీ షో లలో అవినాష్ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా అవినాష్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన భార్యతో కలిసి ఇన్స్టా రీల్స్ చేస్తూ సందడి చేయడమే కాకుండా సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇరిటేట్ చేయకు..
ఇదిలా ఉండగా తాజాగా అవినాష్ చేసిన పనికి అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు అల్లు అర్జున్ అభిమానులు అవినాష్ మీద ఫైర్ అవటానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 నుండి ట్రైలర్ తో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంలో ఉన్నాడు. ఈ పోస్టర్ టాలివుడ్ మాత్రమే కాకుండా అటు బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది. ఎంతోకాలంగా పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఈ పోస్టర్ చూడగానే ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Avinash:
అయితే అల్లు అర్జున్ ఫోటో లాగా తన ఫోటోని కూడా అవినాష్ ఎడిట్ చేసి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫోటోని ఇంస్టాగ్రాంలో షేర్ చేశాడు. అయితే అవినాష్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు అతనికి తిప్పలు తెచ్చి పెట్టింది. ఈ ఫోటో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. వెంటనే ఆ పిక్ ను డిలీట్ చెయ్.. ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేయకు అంటూ కొందరు కామెంట్స్ చేయగా… అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఫోటో డెలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు.