Avinash Mother: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా గుర్తింపు పొందిన ముక్కు అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెర మీద ప్రచారం అవుతున్న టీవీ షోలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి ,తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ మేరకు ఇటీవల తాను తండ్రి కాబోతున్నట్లు ఒక శుభవార్త తెలియజేశాడు. దీంతో అవినాష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే ఇలా తాను తండ్రి కాబోతున్నానన్న ఆనందంలో ఉన్న అవినాష్ తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవినాష్ తల్లి మల్లమ్మ తాజాగా అస్వస్థతకు లోనైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్ ఉండటంతో వైద్యులు స్టంట్స్ వేశారు. ఈ విషయాన్ని అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ..’ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
Avinash Mother: గుండెపోటుకు గురైన అవినాష్ తల్లి..
తన తల్లి ముందు నుంచే షుగర్ వ్యాధితో బాదపడుతోందని… ఈ వ్యాధి వల్ల నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతోంది. ఈ మధ్యే అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చానని తెలిపాడు. డాక్టర్లు పరీక్షించి గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయని చెప్పటంతో ఆంజియోగ్రామ్ చేయించాం, రెండు స్టంట్స్ వేయించాం.అమ్మ ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి’ అంటూ అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. ఇక మరొకవైపు అవినాష్ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తన పెద్ద కొడుకు వల్లే తాను ఈరోజు ప్రాణాలతో ఉండగలుగుతున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.