Avneet Kaur ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో చిన్నాచితకా పాత్రలో నటిస్తూ బాగానే రాణిస్తోంది యంగ్ బ్యూటిఫుల్ మోడల్ మరియు నటి అవనీత్ కౌర్. అయితే ఈ అమ్మడి పేరు చెప్తే ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టరు కానీ చిన్నప్పుడు ప్రముఖ సబ్బుల ఉత్పత్తిదారు సంస్థ అయిన లైఫ్ బాయ్ సోప్ ప్రకటనలో నటించి బంటి నీ సబ్బు స్లోఆ ఏంటి అంటూ క్యూట్ క్యూట్ మాటలతో అలరించిన చిన్నపిల్ల అంటే మాత్రం అయితే గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు పెరిగి పెద్ద వడంతో సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి బాగానే కష్టపడుతోంది.
ఈ క్రమంలో రెండు మూడు సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా నటించింది. దీంతో నటి అవంతిక వరకి సీరియల్స్ లో నటించే ఆఫర్లు వస్తున్నప్పటికీ తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా రాణించాలనే కారణంగా సున్నితంగా నో చెపుతోంది. అయితే ఈమధ్య అవనీత్ కౌర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఘాటుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్ల మతి పోగొడుతుంది.
అయితే తాజాగా అవనీత్ కౌర్ కొంతమేరకు స్కిన్ షో మరియు గ్లామర్ చేస్తూ దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతటితో ఆగకుండా స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న సమయంలో తీసిన టువంటి వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడి పరువపు అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే అవనీత్ కౌర్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందని కాబట్టి హీరోయిన్ గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న టీకు వెడ్స్ షేరు అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.