Balagam Director: ప్రస్తుతం ఎక్కడ చూసినా బలగం సినిమా పేరు వినిపిస్తోంది. సాధారణ కమెడియన్ గా గుర్తింపు పొందిన వేణు బలగం సినిమా ద్వారా తన దర్శకత్వ ప్రతిభను చాటుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. జబర్దస్త్ వేణుగా గుర్తింపు పొందిన ఇతను ప్రస్తుతం బలగం వేణుగా పాపులర్ అయ్యాడు. మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ వేదికల మీద కూడా బలగం వేణు అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో వేణు ఎదుగుదల చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యానికి గురవగా.. అతని గురించి తెలియని వారు ఆరాలు తీస్తున్నారు.
మొదట కమెడియన్ గా సినిమాలలో నటించిన వేణు ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో తనదైన శైలిలో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. సినిమాల కంటే జబర్దస్త్ ద్వారానే వేణుకి మంచి గుర్తింపు లభించింది. అయితే దర్శకత్వం మీద ఉన్న ఆసక్తి వల్ల గత కొంతకాలంగా వేణు జబర్దస్త్ వంటి టీవీ షోలకు,సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా బలగం సినిమా కథ సిద్ధం చేసి ఆ సినిమాకు దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నాడు.
Balagam Director:బలగం సినిమాతో పెరిగిన వేణు క్రేజ్…
వేణు దర్శకత్వ ప్రతిభ చూసి స్టార్ డైరెక్టర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంతటి అద్భుతమైన సినిమాని అందించినందుకు వేణుని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ వరించింది. ఇటీవల వాషింగ్టన్ డిసిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా వేణు అవార్డ్ అందుకున్నాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బలగం వేణు బలగం వేణు అనే పేరు మారుమోగిపోతోంది.