Balagam Movie: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన బలగం సినిమా పేరు మారుమోగిపోతుంది. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కువగా తెలంగాణ ప్రజలను ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది.ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చెయ్యకపోయినా కేవలం మౌత్ టాక్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.ఇలా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ లో కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
ఇక ఈ సినిమాని తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రజలు తెరకట్టి గ్రామం మొత్తం కలిసి కూర్చొని చూస్తున్నారు.ఇలా దండోరా వేసి మరి సినిమాని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు కొన్ని గొడవలు మనస్పర్ధలు కారణంగా విడిపోయిన వారు కూడా తిరిగి కలుసుకుంటున్నారు. ఇలా ఈ సినిమా ప్రభావం తెలంగాణ ప్రజలపై అంతగా పడిందని చెప్పాలి. ఇక ఈ సినిమా చూసినటువంటి సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Balagam Movie: తొలి ప్రయత్నమే ఎంతో అద్భుతం…
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఈ సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ వేణుని స్వయంగా ఇంటికి ఆహ్వానించి ఆయనకు సత్కారం చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోని తాజాగా బలగం సినిమాని మంచు మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. ఇలా ఈ సినిమా చూసిన అనంతరం మోహన్ బాబు బలగం చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి వారికి సన్మానం చేశారు. ఇలా వేణు, ప్రియదర్శి,రూపా లక్ష్మీలను ఇంటికి ఆహ్వానించిన మోహన్ బాబు వారికి సాలువాలు కప్పి సన్మానం చేయడమే కాకుండా తొలి ప్రయత్నంలోనే వేణు ఎంతో అద్భుతమైన చిత్రాన్ని చేశారని ప్రశంసలు కురిపించారు.ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలలో జీవించారని మోహన్ బాబు చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. మోహన్ బాబు విష్ణు చిత్ర బృందాన్ని సన్మానించి సత్కరించారు. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.