Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే నటుడిగా రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి బాలకృష్ణ హైదరాబాదులో బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ, ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత ఉందని చెప్పాలి. నేటికీ ఈ హాస్పిటల్ ప్రారంభించి 22 సంవత్సరాలు అవుతోంది.ఇక ఈ హాస్పిటల్ వార్షికోత్సవ కార్యక్రమానికి బసవతారకం హాస్పిటల్ చైర్ పర్సన్ నందమూరి బాలకృష్ణ అదే విధంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ హరీష్ రావు గురించి మాట్లాడుతూ హరీష్ రావు ట్రబుల్ షూటర్ అంటూ ప్రశంసలు కురిపించారు. హాస్పిటల్ రెగ్యులేషన్ బిల్డింగ్ స్కీమ్ కింద సీఎం కేసీఆర్ ఏకంగా ఆరు కోట్ల రూపాయలనుమాఫీ చేయడంతో ఈ సందర్భంగా బాలకృష్ణ సీఎం కేసీఆర్ కు అలాగే మంత్రి హరీష్ రావు కు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మహోన్నత ఆశయాలతో ఎన్టీఆర్ బసవతారకం హాస్పిటల్ నిర్మించారని, నిమ్స్ తర్వాత ఎంతోమంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన హాస్పిటల్ గా బసవతారకం హాస్పిటల్ నిలిచిందని బాలకృష్ణ పేర్కొన్నారు. తమ హాస్పిటల్ లో 7 ఏసీ వార్డులను ఆరోగ్యశ్రీ కోసమే కేటాయించామని తెలిపారు.

Balakrishna: మూడు లక్షల మంది పేషెంట్లకు సేవలు అందించడం గొప్ప విషయం….
బాలకృష్ణ మాట్లాడిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయసాధనాలను బాలకృష్ణ నెరవేరుస్తారని ఈయన పేర్కొన్నారు. ఈ దారిన వెళ్లే సమయంలో సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ సేవల గురించి ఎంతో గొప్పగా చెప్పారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.ఇక బాలకృష్ణ ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ గారిని అడగగానే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద 6 కోట్ల రూపాయలను మాఫీ చేశామని, గతంలో ఏ సీఎం కూడా ఇలా చేయలేదని,తెలంగాణ ప్రభుత్వం కేవలం క్యాన్సర్ పేషెంట్ల కోసం మాత్రమే 750 కోట్లకు పైగా ఖర్చు చేశారని హరీష్ రావు వెల్లడించారు. బసవతారకం హాస్పిటల్ గత ఇరవై రెండు సంవత్సరాలలో మూడు లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించడం గొప్ప విషయం అంటూ హరీష్ రావు ఈ సందర్భంగా బసవతారకం హాస్పిటల్ గురించి కొనియాడారు.