Balakrishna: ఇండస్ట్రీలో ఎంతోమంది కుర్ర హీరోలు ఉన్నప్పటికీ బాలకృష్ణకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ మాత్రం ఏ హీరోకి ఉండదు. ఇటీవల వీరసింహారెడ్డి సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతేకాకుండా యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ యాక్షన్ డ్రామాగా పొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య కాళీమాత భక్తుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం నరసింహ స్వామి భక్తుడిగా నటించిన బాలకృష్ణ ఇటీవల విడుదలైన అఖండ సినిమాలో శివ భక్తుడిగా నటించాడు.
Balakrishna: సరికొత్త పాత్రలో బాలయ్య…
ఇక ప్రస్తుతం రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య కాళీమాత భక్తుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా సినిమాకు హైలైట్ గా ఉంటుందని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో బాల్యయ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రేక్షకులు చూడబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.