Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని వివాదం ముగిసిన తర్వాత ఈయన నర్సుల గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛందప్రసాద్ బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడుతూ బాలయ్య నర్సుల గురించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ విధంగా బాలకృష్ణ నర్సులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.
ఇలా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా నర్సుల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపడంతో ఎట్టకేలకు బాలకృష్ణ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా నర్సులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశానని కొందరు అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలను తాను ఖండిస్తున్నానని తెలిపారు. నా మాటలను వక్రీకరించారు. రోగులకు సేవలు అందించే నా సోదరీమణులు అంటే నాకు ఎంతో గౌరవం.
Balakrishna: నర్సుల సేవలు ప్రత్యక్షంగా చూశాను…
నర్సులు చేసే సేవలను నా ఆస్పత్రిలో ప్రత్యక్షంగా చూశాను. కరోనా వంటి విపత్కర కాలంలో నిద్రాహారాలు మానేసి నర్సులు ఎంతో సేవ చేశారని బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీసి ఉంటే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ నర్సుల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ క్షమాపణలు తెలియజేశారు. ప్రస్తుతం బాలయ్య చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే బాలయ్య ఈ మధ్యకాలంలో తెలిసి మాట్లాడుతున్నారా లేక పొరపాటుగా నోరు జారుతున్నారో తెలియదు కానీ వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.