Balakrishna: నాకు ఏం కాలేదురా బాబు.. సర్జరీ వార్తలపై బాలయ్య లబోదిబో!

Akashavani

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో గా కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా యువ హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుంటున్నారు.ఈ క్రమంలోనే బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా విజయవంతం అయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. మైత్రి మూవీ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న గోపీ చంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణ కూడా ఈ సినిమా ద్వారా ఊర మాస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

బాలకృష్ణ తన తదుపరి చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం అవటంవల్ల ఆయన చేతికి శస్త్రచికిత్స చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల బాలకృష్ణకు మరొకసారి శస్త్రచికిత్స జరిగిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం బాలకృష్ణ తీవ్రమైన మోకాళ్ళ నొప్పితో బాధ పడుతున్నాడు. అందువల్ల ఆయన కాళ్ళకు సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna: నాకు ఏం కాలేదురా బాబు.. సర్జరీ వార్తలపై బాలయ్య లబోదిబో!
Balakrishna: నాకు ఏం కాలేదురా బాబు.. సర్జరీ వార్తలపై బాలయ్య లబోదిబో!

Balakrishna: ఊపిరిపీల్చుకున్న అభిమానులు….

ఈ వార్తల మీద బాలకృష్ణ పీఆర్ టీం స్పందించింది. బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు . జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుందని ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం NBK107 షూటింగ్ కోసం సారధి స్టూడియోకి వెళ్ళారు. దయచేసి ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయకండి అని అసలు విషయం చెప్పారు. అఖండ సినిమా ఇచ్చిన విజయంతో మంచి ఫామ్లో ఉన్న బాలకృష్ణ వరసగా సినిమాలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ సర్జరీ గురించి క్లారిటీ రావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -