Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో నిలుస్తున్నారు. అయితే ఈయన తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఈయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకున్నారు.వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ వర్గానికి చెందిన కులస్తుల గురించి ఈయన నోరు జారారు అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై బాలయ్య ఆ కులస్తులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయం మర్చిపోకముందే మరోసారి అక్కినేని ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈ క్రమంలోనే కొద్ది రోజులపాటు నందమూరి వర్సెస్ అక్కినేని అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ జరిగింది.అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలయ్య తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచలేదని ఏఎన్ఆర్ గారి పై తన ప్రేమ తన గుండెల్లో అలాగే ఉందంటూ ఈ వివాదానికి చెక్ పెట్టారు.
Balakrishna: దానెమ్మ నర్స్ చాలా అందంగా ఉంది…
ఇకపోతే తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బాలకృష్ణ టాక్ షోకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి ప్రస్తావనకు వచ్చింది ఈ క్రమంలోనే బాలయ్య తాను కూడా గతంలో ఒకసారి బైక్ పై ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురయ్యానని గుర్తు చేసుకున్నారు.అయితే తాను రోడ్డు క్రాస్ చేస్తుండగా మరొక బైక్ వచ్చి తనకు తగిలిందని తన మొహం మొత్తం గాయాలు కావడంతో హాస్పిటల్లో చేర్చారని తెలిపారు. అయితే హాస్పిటల్లో ఒక నర్స్ తనకు చికిత్స చేస్తూ ఏమైంది అని అడిగారు. కింద పడ్డానని చెప్పాను దానేమ్మ ఆ నర్స్ ఎంతో అందంగా ఉంది అంటూ నర్స్ గురించి ఈయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలయ్య వ్యాఖ్యలపై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఈయన నర్సులకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై బాలయ్య స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.