Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు ఎంత కోపం ఉందో మనకు తెలిసిందే. ఈయన ఎంత తొందరగా కోప్పడతారో అంతే తొందరగా ఇతరుల పట్ల ప్రేమ కూడా చూపిస్తారు ఒకసారి తన మనిషి అనుకుంటే వారి కోసం బాలకృష్ణ ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారని ఇప్పటికే ఎంతోమంది ఆయనతో కలిసి పని చేసిన వారు ఆయనని దగ్గరగా చూసినవారు బాలయ్య గురించి గొప్పగా చెప్పారు. అయితే తాజాగా బాలకృష్ణ నటి శ్రీలీలపై చేయి చేసుకున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా NBK 108 వర్కింగ్ టైటిల్ తో శర గంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా తనకు కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్స్ నటించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సన్నివేశాలలో భాగంగా బాలకృష్ణ హీరోయిన్ శ్రీలీలపై చేయి చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Balakrishna: నిజంగానే కొట్టిన బాలయ్య…
అసలు బాలకృష్ణ హీరోయిన్ పై చేయి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈ సినిమాలో శ్రీ లీల కాస్త అల్లరి పిల్లగా నటించబోతుందని సమాచారం. ఎంత చెప్పినా వినకుండా ఆమె అల్లరి పనులు అలాగే కొనసాగిస్తూ ఉంటుందని అందుకే బాలయ్య తనని కొట్టే సన్నివేశం చిత్రీకరించాల్సి వచ్చినప్పుడు,కొట్టినట్టు నటిస్తే సహజ సిద్ధంగా ఉండదని భావించిన శ్రీ లీల నిజంగానే బాలయ్యతో కొట్టించుకున్నారట. ఇలా బాలకృష్ణ గారు తనని నిజంగానే కొట్టడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాక్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఒక సన్నివేశం సహజ సిద్ధంగా రావడం కోసం శ్రీ లీల తన్నులు తినడం గర్వించదగ్గ విషయమని చెప్పాలి. ఇలా నటన పట్ల ఈమెకు ఇంత డెడికేషన్ ఉంది కనుక ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి.