Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇక ఈయన సినిమాలు అంటే చెవి కోసుకొనే అభిమానులు చాలామంది ఉన్నారు.ఇలా నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి బాలకృష్ణకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక బాలకృష్ణ పుట్టిన రోజు వచ్చిన లేకపోతే ఇతర కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులు వివిధ రకాల సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అయితే తాజాగా బాలయ్య అభిమాని మాత్రం నిత్య అన్నదానం చేస్తూ సంచలనంగా మారారు. బాలయ్యకు వీరాభిమాని అయినటువంటి ఉప్పుటూరి రామ్ చౌదరి అమెరికాలో ఉంటున్నప్పటికీ ఇక్కడ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం 50 రోజుల మైలురాయిని చేరుకుంది బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతిరోజు బసవతారకం హాస్పిటల్ లో ఉన్నటువంటి రోగులకు వారి సహాయకులకు ఈయన నిత్యాన్నదానం చేస్తూ బాలయ్య పై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు.అమెరికాలోని తన స్నేహితులతోనూ అలాగే చేతన ఫౌండేషన్ తో కలిసి బాలకృష్ణ ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Balakrishna: రోగుల ఆకలి తీర్చుతున్న అభిమాని
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నటువంటి రామ్ తన స్నేహితుడు శివ ద్వారా బసవతారకం హాస్పిటల్లో రోగులు ఎదుర్కొన్నటువంటి ఆకలి కేకలు గురించి తెలుసుకున్నారు.వ్యక్తిగతంగా బాలయ్యకు ఎంతో అభిమాని అయినటువంటి రామ్ బసవతారకం హాస్పిటల్ లో రోగుల ఆకలి తీర్చడం కోసం ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెజ్ బిర్యానీ, అన్నం, పప్పు, కూర, పచ్చడి, సాంబార్, లడ్డు, వడియాలు, మజ్జిగ, అప్పడాలు, వారంలో మూడుసార్లు చికెన్ కూర, గుడ్డు, బిర్యానీ వంటి ఆహార పదార్థాలను అందిస్తూ ఎంతోమంది ఆకలి తీర్చారు ఇలా ఈయన చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం గురించి తెలియడంతో ఎంతో మంది ఈయన పని పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.