Balakrishna: అందరూ ఆకలితో ఉన్నారు.. అప్పుడే ఇంటి నుంచి బాలయ్యకు భోజనం.. అతర్వాత జరిగింది ఇదే!

Akashavani

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ ఎన్నో సినిమాలలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వయసు మీద పడినా కూడా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటీవల విడుదలైన అఖండ సినిమా మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా తన సత్తా చాటుకున్నాడు. ఆహా లో స్ట్రీమ్ అయిన ” అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ” అనే టాకింగ్ షో కి హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కాని కొన్ని కొన్ని సందర్బాలలో బాలకృష్ణ బిహేవియర్ గురించీ నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆయనతో పనిచేసిన వారు మాత్రం ఆయన వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు.

ఇటీవల ప్రముఖ నటి శివ పార్వతి బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన శివ పార్వతి ప్రస్తుతం పలు బుల్లి తెర మీద ప్రసారమవుతున్న పలు సీరియళ్లలో నటిస్తోంది. శివ పార్వతి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక్క మగాడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆమె చెప్పుకొచ్చారు.

Balakrishna:  అందరూ ఆకలితో ఉన్నారు.. అప్పుడే ఇంటి నుంచి బాలయ్యకు భోజనం.. అతర్వాత జరిగింది ఇదే!
Balakrishna: అందరూ ఆకలితో ఉన్నారు.. అప్పుడే ఇంటి నుంచి బాలయ్యకు భోజనం.. అతర్వాత జరిగింది ఇదే!

Balakrishna:  బాలకృష్ణ వ్యక్తిత్వం అలాంటిది..

బాలకృష్ణ గారికి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క మగాడు సినిమా షూటింగ్ కోసం ఒక మారుమూల గ్రామంలో ఉన్నఅనుసంధానాన్ని గుడికి వెళ్ళాము. బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారని తెలియటంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు ఆయనను చూడటానికి వచ్చరు. జనం ఎక్కువగా ఉండటంతో నిలబడటానికి కూడా అవకాశంలేదు . అందువల్ల సినిమా యూనిట్ సభ్యులను మాత్రం లోపల ఉంచి గుడి తలుపులు మూసివేశారు. మధ్యాహ్నం మూడు గంటలు అవుతున్న భోజనం తీసుకురావటానికి బయటికి వెళ్ళ లేక అందరూ ఆకలితో అలమటిస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి మాత్రమే ఒక పెద్ద గ్యారేజ్ వచ్చింది. ఆ సమయంలో బాలకృష్ణ గారు తాను ఒక్కడే కారేజ్ తినకుండా అక్కడ షూటింగ్ లో ఉన్నా అందరికీ ఆ కేరేజ్ పంచిపెట్టమని పంపారు. ఆ సమయంలో అందరికీ భోజనం పెట్టాలన్న ఆయన అలోచలన వల్లే మేము కడుపు నిండా భోజనం చేసాము, లేదంటే ఆ పూట అందరం పస్తులుండవలసి వచ్చేది. బాలకృష్ణ వ్యక్తిత్వం అది అంటూ నటి శివపార్వతి బాలకృష్ణ గారి గురించి చెప్పుకొచ్చింది

- Advertisement -