Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల వీరసింహారెడ్డి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణకి మరొక హిట్ ఇస్తానని అనిల్ రావిపూడి బాలయ్య అభిమానులకు మాట ఇచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో బిజీగా ఉన్నాడు. మునుపెన్నడు బాలయ్యని చూడని విధంగా సరికొత్తగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా సినిమాల విషయంలో బాలయ్య సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటాడు. ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో బాలకృష్ణకు సెంటిమెంట్ ఉంది. సినిమా టైటిల్ లో సింహ అనే పేరు ఉంటేనే సినిమా హిట్ అవుతుందని బాలయ్యకు గట్టి నమ్మకం. అందువల్ల తాను నటించిన సినిమాలలో సింహ అనే టైటిల్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటాడు. టైటిల్ లో సింహ అనే పదమున్న సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో కూడా సింహ అనే పేరు ఉండటం వల్ల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని నమ్మకం .
Balakrishna: బాలయ్య సెంటిమెంట్ రిపీట్ …
ఇక ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి ” భగవంత్‌లాల్ కేసరి”అనే టైటిల్ కి ‘ ఐ డోంట్ కేర్’ అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ విషయంలో అనిల్ రావిపూడి బాలయ్య సెంటిమెంట్ ని గౌరవిస్తూ ఈ సినిమా టైటిల్ లో సింహ అనే పేరు వచ్చేలాగా ఈ టైటిల్ ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హిందీలో సింహాన్ని పిలిచే కేసరి పదాన్ని ఈ సినిమా టైటిల్ కి కలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయంలో బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.