Balakrishna:నందమూరి నటసింహం బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా ఈ మధ్యన బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో బాలకృష్ణ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక బాలకృష్ణ గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ముఖ్యంగా బాలకృష్ణ విగ్ గురించి ఎన్నో సార్లు చర్చలు జరుగుతూ ఉంటాయి.బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. కనుక ఒక పాత్రలో రియల్ హెయిర్ అయినప్పటికీ మిగతా పాత్ర కోసం ఆయన తప్పకుండా విగ్గు ధరించాల్సి ఉంటుంది.
ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు విగ్ వాడుతూ సినిమాలలో నటిస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి బాలకృష్ణ విగ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలయ్యకు విగ్ సెట్ చేయాలి అంటే మేము కొన్నిసార్లు ముంబై చెన్నై నుంచి తెప్పిస్తామని అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోనే మనకు ఎన్నో రకాల విగ్ లు అందుబాటులో ఉన్నాయని వాసు వెల్లడించారు. ఇక బాలయ్యకు ఉపయోగించే విగ్గు ధర చాలా ఖరీదైనదే ఉంటుంది ఆయన విగ్గు కోసం లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని వాసు తెలియజేశారు. బాలకృష్ణ నాసిరకం విగ్గులను అసలు ఉపయోగించరని ఈయన వెల్లడించారు.
Balakrishna: నాసిరకం విగ్ వాడరు…
ఇక బాలయ్యకు విగ్గు సెంటిమెంట్ ఉందని చాలామంది భావిస్తుంటారు కానీ ఆయనకు ఆ విగ్గు సెంటిమెంట్ లేదని ప్రేక్షకులు మాత్రం బాలకృష్ణ నటించిన సినిమాలలో కనుక విగ్ మంచిగా సెట్ అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న సెంటిమెంట్ అభిమానులలోను ప్రేక్షకులలోను ఉందని వాసు వెల్లడించారు. అయితే బాలయ్యకు విగ్గు కొనాలి అంటే అది ఆయన సొంత డబ్బుతో కొనరు. సినిమాకు కావాల్సిన లుక్ కావాలి అంటే అందుకు సంబంధించిన విగ్ లను నిర్మాతలే కొనుగోలు చేస్తారంటూ ఈ సందర్భంగా వాసు తెలియజేశారు.