Balakrishna – Pawan Kalyan: ఓటీటీ వేదికగా ఆహాలో ప్రసారమవుతున్న రియాలిటీ షో అన్ స్టాపబుల్ తో బాలయ్య ఎంతలా సందడి చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. ఈ షోతో బాలయ్య అందరితో ఎలా ఉంటాడు అనేది అందరికీ అర్థం అయింది. ఇక ఈ షో మొదటి సీజన్ పూర్తి కాగా ప్రస్తుతం రెండవ సీజన్ కూడా మంచి విజయవంతంగా కొనసాగుతుంది.
ఇక ఈ సీజన్ లో కూడా మంచి పవర్ఫుల్ స్టార్లను పట్టుకొచ్చి బాగా సందడి చేస్తున్నాడు బాలయ్య. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రాగా ఆ ఎపిసోడ్ కు సంబంధించిన రెండవ ప్రోమో కూడా విడుదల అయింది. ఇక అందులో పవన్ కళ్యాణ్ తో బాలయ్య బాగా ఆడుకున్నట్లు కనిపించాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య పై పంచులు వేస్తూ కనిపించాడు.
ఇక బాలయ్య పవన్ తో ఉన్న దిగిన ఒక అప్పటి ఫోటో పంచుకొని అప్పుడు కుర్రాడిలా ఉన్నాను కదా అనటంతో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అంటూ పవన్ కళ్యాణ్ సరదాగా కామెంట్ చేశాడు. ఇక తను డైరెక్టర్ త్రివిక్రమ్ ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ నవ్వుతూ చెప్పాడు. ఇక పవన్ గతంలో జరిగిన కొన్ని సరదా సంఘటనలు కూడా తెలిపాడు.
Balakrishna – Pawan Kalyan:
ఆ తర్వాత మధ్యలో సాయిధరమ్ తేజ్ పంచె కట్టులో రాగా.. వెంటనే బాలయ్య ఏంటి పెళ్లి చూపులకు వచ్చావా అంటూ కామెంట్ చేశాడు. ఇక బాలయ్య సాయి ధరంతేజ్ ను తొడ కొట్టమని అనడంతో వెంటనే సాయి ధరం తేజ్ బాలయ్య దగ్గరికి వెళ్లగా నా తొడ కాదయ్యా అంటూ బాలయ్య గట్టిగా అరిచాడు. దాంతో అక్కడిన వాళ్లంతా బాగా నవ్వుకున్నారు. ఆ తర్వాత బాలయ్య పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా అడిగినట్లు అనిపించగా పవన్ ఏదో సీరియస్ మ్యాటర్ చెప్పినట్లు కనిపించాడు. మొత్తానికి ఈ ప్రోమో బాగా సందడిగా మారగా దీని ఎపిసోడ్ కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.