Balakrishna: డీజే టిల్లు సినిమా ద్వారా హీరోగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది విడుదలైన డీజే టిల్లు సినిమాతో హీరోగా గుర్తింపు పొందటమే కాకుండా రైటర్ గా కూడా తన సత్తా నిరూపించుకున్నాడు. డి జె టిల్లు సినిమా విడుదలై ఏడాది పూర్తయినా కూడా ఇప్పటికీ ఆ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. ఈ సినిమాలో సిద్దు చెప్పిన డైలాగులు ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో హీరోగా బాలకృష్ణకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఎంతోమంది ఆయనకి అభిమానులుగా మారారు. ఇండస్ట్రీలోని ఎంతోమంది సెలబ్రిటీలు కూడా బాలయ్య మంచి మనసు గురించి చెబుతూ ఉంటారు. ఇక బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరు కలిసి ఆ షోకి హాజరయ్యారు. అప్పటినుండి ఈ కుర్ర హీరోలు ఇద్దరు కూడా బాలయ్యకి అభిమానులుగా మారిపోయారు.
Balakrishna: సొంత వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు…
ఇదిలా ఉండగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ” సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కూడా ఆయనకు అభిమానులే అని సిద్దు చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ అంటే మంచికి మారు పేరు. ఆయన ఎవరినైనా నమ్మితే వారికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. బాలకృష్ణ విశాల హృదయం కలిగినటువంటి ఒక సూపర్ మ్యాన్ అంటూ సిద్ధు చెప్పుకొచ్చాడు. అందమైన, దయ కలిగిన చిన్నపిల్లాడి మనస్తత్వం బాలయ్యది అంటూ బాలయ్యా వ్యక్తిత్వం గురించి ప్రశంసించాడు. ప్రస్తుతం బాలయ్య గురించి సిద్దు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.