Balakrishna: నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల అఖండ సినిమా ద్వారా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మరోక మాస్ ఎంటర్టైనర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నేను ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.
ఇదిలా ఉండగా వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అంతేకాకుండా చుట్ట తాగటం ఆరోగ్యానికి మంచిదని ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చుట్టా కాల్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని బాలకృష్ణ వెల్లడించాడు. అంతేకాకుండా చుట్ట కాల్చడం ఆరోగ్యానికి మంచిదని, ప్రతిరోజు తను నిద్రలేచిన వెంటనే చుట్ట కాలుస్తానని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Balakrishna: బాలయ్య డైలాగులు గంభీరంగా చెప్పడం వెనక ఉన్న రహస్యం ఇదేనా…
ఇలా చుట్ట కాల్చడం వల్ల గొంతు క్లీన్ అవుతుందని, అంతే కాకుండా ఊపిరితిత్తుల్లో ఉన్న శ్లేష్మం కూడా తొలగిపోతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతిరోజు చుట్ట కాల్చడం వల్ల గొంతు శుభ్రపడి మన వాయిస్ చాలా గంభీరంగా ఉంటుందని, డైలాగ్ చెప్పే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని బాలయ్య వెల్లడించాడు. అంతే కాకుండా సిగరెట్ తాగడం కన్నా చుట్ట కాల్చటం మంచిదని, సిగరెట్ పొగ లాగా కడుపులోకి పీల్చుకోకుండ నోటిలోకి పీల్చుకుంటామని, అందువల్ల సిగరెట్ కన్నా చుట్ట ఆరోగ్యానికి మంచిదని వివరించారు. బాలయ్య అలాంటి భారీ డైలాగులు చెప్పటానికి రహస్యం ఇదేనా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.