Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల విడుదలైన వీర సింహారెడ్డి సినిమా కూడా సక్సెస్ ఫుల్ గా 100 రోజులు ఆడింది. ఇక ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పనులతో బాలయ్య బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో బాలయ్యకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా కూడా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి.
అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఏ చిన్న కారణం దొరికినా కూడా ఆయనని ట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకు కారణం అభిమానులపై బాలయ్య చేయి చేసుకోవటం. అయితే బాలయ్యతో పనిచేసిన దర్శక నిర్మాతలు తోటి నటీనటులు మాత్రం ఆయన మంచి మనసు గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమా హిట్ అయితే హీరోలకు, దర్శకులకు బహుమతులు ఇస్తుంటారు. అలాగే కొందరు హీరోలు తమ అభిమానులకు,అలాగే అభిమానులు కూడా తమ అభిమాన హీరోలకు కానుకలు ఇస్తుంటారు.
Balakrishnaసింహపు ఉంగరం కానుక…
అలాగే ఇక్కడ కూడా ఒక అభిమాని బాలయ్యకు ఒక అద్భుతమైన బహుమతి అందజేసినట్లు తెలుస్తోంది. బాలయ్యకి నరసింహ స్వామి అంటే అపారమైన భక్తి. అందువల్ల తను తీసే ప్రతి సినిమా టైటిల్ ని సింహ అని పేరు కలిసేలాగా పెట్టుకుంటాడు. అందువల్ల అభిమాని కూడా బాలయ్యకు బంగారంతో తయారు చేసిన ఖరీదైన ఒక సింహపు ఉంగరాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా అభిమాని బాలయ్య మీద తనకి ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పటివరకూ ఏ హీరోకి కూడా అభిమానులు ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది