Bandla Ganesh: తెలుగు ఇండస్ట్రీకి బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినీ నటుడిగా మొదలైన ఆయన ప్రయాణం నేడు రాజకీయా నాయకుడి స్థాయి వరకు చేరుకుంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాడు. ఇక స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు బండ్ల గణేష్.
గబ్బర్ సింగ్ వంటి సినిమాలకు నిర్మాత గా వహించి ఇండస్ట్రీ హిట్ ను తన సొంతం చేసుకున్నాడు. మొత్తానికి బండ్ల గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడూ పవర్ స్టార్ ద్యానం లోనే ఉంటాడు. ఇక వీలు కుదిరినప్పుడల్లా పవర్ స్టార్ తో ఏదో ఒక సినిమా తెర మీదకు తీసుకొని రావాలి అన్న ఆలోచనలో ఉంటాడు.
ఇదిలా ఉంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయడానికి ఆరాటపడిన గణేష్ ఇప్పుడు పవన్ తో సినిమాలు తీయను అని అంటున్నాడు. ఇక అసలు విషయానికి వెళితే బండ్ల గణేశ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గారి తో సినిమాలు తీయనని క్లారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు నాలుగైదు సినిమాలు ఒప్పుకున్నారు.

Bandla Ganesh: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయక పోవడానికి కారణం ఇదే!
వాటిని పూర్తి చేసుకుని నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. అసలు పవన్ గారితో సినిమాలు తీయకూడదని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే ? ఆయన త్వరగా ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.