Bandla Ganesh: బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల క్రితం ఎవరినీ నమ్మ కూడదు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన ఆడియో ట్వీట్ వైరల్ అయింది.అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ సినిమా ఈవెంట్లలో కనిపించకపోవడంతో బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ దూరం పెట్టారని అందరూ భావించారు.ఇలా సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నటువంటి బండ్ల గణేష్ తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేదిక పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మందిని సూపర్ స్టార్, మెగాస్టార్ లను చేశారు. డైలాగులు చెప్పేకి రాని వారిని కూడా స్టార్లను చేశారు.కానీ తన కొడుకు కోసం మాత్రం ఆయన రాలేదు .ఇది పూర్తిగా తప్పు అంటూ బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ ను తప్పు పట్టారు.ఇక పోతే ఈ కార్యక్రమంలో భాగంగా బండ్లగణేష్ సూపర్ స్టార్ మెగాస్టార్ అని పేర్లు చెప్పడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు, రామ్ చరణ్ ని ఉద్దేశించి చేశారని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bandla Ganesh: డైలాగులు చెప్పేకి రాని వారు కూడా స్టార్స్ అయ్యారు..
ఈ క్రమంలోనే మెగాస్టార్ సూపర్ స్టార్ అభిమానులు బండ్ల గణేష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండ్ల గణేష్ సూపర్ స్టార్ మెగాస్టార్ లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా చోర్ బజార్ సినిమా వేడుకలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యల పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో బండ్ల గణేష్ ను ట్రోల్ చేస్తున్నారు.మరి ఈ విషయంపై బండ్లగణేష్ ఏవిధంగా స్పందిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.ఇక పూరి జగన్నాథ్ ముంబైలో జనగణమన షూటింగ్ సినిమాతో బిజీగా ఉండటంవల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు దీంతో పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.