Bandla Ganesh: బండ్ల గణేష్ ఏ కార్యక్రమానికి వెళ్లిన లేదా సోషల్ మీడియా వేదికగా చిన్న ట్వీట్ చేసిన క్షణాల్లో సంచలనంగా మారుతుంది.ఇక సినిమా వేడుకలలో ఈయన వేదికపైకి మాట్లాడితే ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉన్నటువంటి బండ్ల గణేష్ తాజాగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమాల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం సాయంత్రం ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్లగణేష్ హాజరయ్యారు.ఈ క్రమంలోనే వేదిక పై బండ్ల గణేష్ మాట్లాడుతూ పూరి జగన్నాథ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ… ఒక సామెత ఉంది దేశమంతా కల్లాపి చల్లిన వాడికి ఇంటి ముందు కల్లాపి చల్లుకోవడానికి సమయం లేదంట. అలాగే ఉంది పూరిజగన్నాథ్ వ్యవహారం చూస్తుంటే. ఈయన ఇండస్ట్రీలో డాన్స్ రాని వాళ్ళకి ,డైలాగులు చెప్పడం రాని వారికి కూడా అన్నీ నేర్పించి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా నిలబెట్టాడు. కానీ తన కొడుకు వేడుకకు వచ్చే సమయం, తీరిక ఆయనకు లేకుండా పోయింది అంటూ కామెంట్ చేశారు.

Bandla Ganesh: ఆకాష్ కోసం పూరి జగన్నాథ్ వేచి చూడాలి..
ఆకాశ్ స్థానంలో నా కొడుకు ఉంటే ఎక్కడున్నా స్పెషల్ ఫ్లైట్ వేయించుకుని మరి వచ్చేవాడిని. మనం బతికేది వారి కోసం అలాంటప్పుడు వారి కోసం ఇలాంటి త్యాగాలను చేయాలి. ఆకాశ్ అంటే సన్నాఫ్ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో ఎంతో మందిని స్టార్స్ ను చేసిన నువ్వు నీ కొడుకు విషయం వచ్చేసరికి ఎక్కడ ముంబై లో ఉన్నావా అంటూ ఆయనను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.నువ్వు నీ కొడుకుని స్టార్ చేసినా చేయకపోయినా ఆకాశ్ ఫ్యూచర్ లో గొప్ప స్టార్ అవుతాడు. రాసి పెట్టుకో… నువ్వు బ్యాంకాక్ వెళ్లి కథ సిద్ధం చేసుకొని ఆకాష్ కోసం క్యూలో నిలబడాలి అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.