Bandla Ganesh: టాలీవుడ్ నటుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బండ్ల గణేష్ ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా గతంలో రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. గతంలో ఈయన రాజకీయాలలో జరిగిన పరిణామాలు కారణంగా ఈయన కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇలాంటి సినిమాలు నిర్మించకపోయినా డేగల బాబ్జీ అనే సినిమా ద్వారా హీరోగా రానున్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే బండ్ల గణేష్ మెగా కుటుంబానికి వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఈయన చెవి కోసుకొంటారు.పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే స్పందిస్తూ వారికి కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇక ఏ వేదికపై వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకు రాకుండా బండ్లగణేష్ ఉండలేరు. ఇలా నిత్యం పవన్ భజన చేస్తూ దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అవుతూ ఉంటాడు.

Bandla Ganesh: ఎమ్మెల్యే టికెట్ కోసమే తాపత్రయం…
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతి ఒక్కరూ వారి పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా వచ్చే ఎన్నికలలో విజయం కోసం భారీగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ పొందాలని ఎంతో ఆత్రుత పడుతున్నారు.ఈ క్రమంలోనే కేవలం టికెట్ కోసం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారనీ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పవన్ గురించి ట్వీట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం, అవకాశాన్ని చూసి ఇలా పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతూ ట్వీట్ చేయడం మంచిది కాదంటూ బండ్ల గణేష్ గురించి ట్వీట్ చేశారు.