Bandla Ganesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై సీనియర్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చాలా సీరియస్‌గా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం పూరిపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెకెక్కిన చోర్ బజార్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూరి తమ్ముడు, హీరో సాయి రాం శంకర్, పూరి సతీమణి లావణ్య, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే కన్న కొడుకు సినిమా రిలీజ్ అవుతూ చిత్ర ప్రమోషన్స్ జరుగుతుంటే పూరి రాకపోవడం చాలా హాట్ టాపిక్ అవుతోంది. ఆకాష్ హీరోగా రెండవ సినిమాను పూరి తెరకెక్కించాడు. మెహబూబా అనే టైటిల్‌తో సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు. ఈ సినిమా ఆకాష్‌కు మంచి పేరు తెచ్చింది. అయితే, కమర్షియల్‌గా మాత్రం హిట్ సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆకాష్ హీరోగా పూరి నిర్మాణంలో రొమాంటిక్ సినిమా వచ్చింది. దీనికి పూరి కథ, స్క్రీన్ ప్లే అందించారు. పూరి అసోసియేట్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించాడు.
Bandla Ganesh: ఎంతో మంది ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు.
పర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమా కూడా ఆకాష్‌కు మంచి పేరు తీసుకువచ్చినప్పటికీ హిట్ కాలేదు. ఇప్పుడు నాలుగో సినిమాగా చోర్ బజార్ తెరకెక్కింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌కు పూరి రాకపోవడంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏమీ రానివారిని స్టార్స్, సూపర్ స్టార్స్‌ను చేశావు.డైలాగులు రానివాళ్లకు డైలాగులు నేర్పించావు, డాన్సులు రానివారికి డాన్సులు నేర్పించావు. నీ కొడుకు సినిమా ఫంక్షన్ అయితే ముంబైలో కూర్చున్నావు. ఇది కరెక్ట్ కాదన్నా అంటూ పూరి పై బండ్ల ఫైర్ అయ్యాడు. అంతేకాదు, నీకొడుకును, కూతురుని, భార్యను మోసే బాధ్యత నీదే. మధ్యలో ఎంతో మంది ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు. నీతో జీవితాంతం ఉండేది మాత్రం నీ ఫ్యామిలీనే అని మాట్లాడాడు. దీంతో బండ్ల కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.