Bandla Ganesh : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన సినిమా ధమాకా. ఈ నెల 23న సినిమా బాక్సాఫీస్ ముందుకు రాగా.. మిక్స్ డ్ టాక్‌ను ఈ సినిమా దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. శ్రీలీల గ్లామరో షో, రవితేజ యాక్షన్ సీన్స్, ఎనర్జీ ఎలిమెంట్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో ధమాకాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.
ఈ క్రమంలో ధమాకా యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ కు నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. రవితేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్ లో 12 మంది డైరెక్టర్లను పరిచయం ఏకైక హీరో రవితేజ అని, ముందు ఫోన్ చేసి చెప్పి మరీ ధమాకా సక్సెస్ మీట్‌కు వచ్చానని బండ్ల గణేష్ తెలిపాడు. ఇప్పటివరకు ఆస్తమించిన రవిని చూశామని, ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి తాను మాట్లాడుదామని వచ్చానిన బండ్ల గణేష్ స్పష్టం చేశాడు.
రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు అని, తాను రవితేజ ఫ్యాన్ అని చెప్పుకోవాలంటే గర్వం ఉండాలని బండ్ల గణేష్ తెలిపాడు. కొందరికి రవితేజ పని అయిపోయిందని అనుకుంటారని, ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడని అన్నాడు. ఆయన ఒక అరాచకం అని, రవితేజను చూస్తే నల్లమల ఆడవుల్లో నల్లతాచులా ఉన్నాడని అన్నాడు. క్రికెటర్ లో విరాట్ కోహ్లీ, అర్జెంటీనా ప్లేయర్ మెస్సీలా రవితేజ వన్ మ్యాన్ షో చూపించాడని బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించాడు.
Bandla Ganesh :
12 మంది దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని, అదృష్టం కలిసి వచ్చిన వాళ్లు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అవుతారని బండ్ల గణేష్ స్పష్టం చేశాడు. రవితేజ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడని, ఇప్పటివరకు ఆస్తమించిన రవిని చూశామని, ఎప్పటికీ ఆస్తమించని రవితేజ గురించి తాను మాట్లాడటానికి వచ్చానని బండ్ల గణేష్ స్పష్టం చేవాడు.