Bandla Ganesh: ‘బండ్లన్నా మజాకా..పూరి కొడుకోసం ఇండస్ట్రీనే కదిలించాడుగా’..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవును కొన్ని గంటల క్రితం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చోర్ బజార్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. అయితే, ఈ వేడుకకు పూరి సినిమాలు తీసి హిట్ ఇచ్చిన ఒక్క హీరో కూడా రాలేదు. కనీసం కన్న తండ్రి పూరి జగన్నాథ్ కూడా తన కొడుకు సినిమా రిలీజ్ అవుతుంటే ప్రమోట్ చేయడం గానీ, ఈవెంట్‌కు రావడం కానీ, జరగలేదు.
ఇదే విషయాన్ని గెస్ట్‌గా హాజరైన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్టేజ్‌పై ప్రస్తావిస్తూ పూరీ దగ్గర్నుంచీ ప్రతీ స్టార్ హీరోను నేరుగానే ఏకిపారేశాడు. దాంతో నిన్నటి నుంచి బండ్లన్న కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిన్ను నమ్మి 200 జోబులో ఉంటే కూడా గుడిలో తాళి కట్టించుకొని నీతో వచ్చేసిన వదిన గ్రేట్. నువ్వు స్టార్ డైరెక్టర్ కాకముందే వదిన నీతో వచ్చేసింది. నువ్వు స్టార్ అయ్యాక మిగతా వాళ్ళు వచ్చారు. వ్యాంపులు ర్యాంపులు వస్తారు పోతారు..నీతో జీవితాంతం ఉండేది నీ భార్య, పిల్లలు మాత్రమే.
Bandla Ganesh: బండ్ల గణేష్ మాట్లాడిన వాటిలో ఏ ఒక్కటీ తప్పు అని ఎవరూ నెగిటివ్‌గా కామెంట్స్ చేయడంలేదు.
నువ్వు ఎంతో మందిని స్టార్లను చేశావు..సూపర్ స్టార్లను చేశావు..వాళ్ళెవరూ నీ కొడుకూ సినిమా రిలీజ్ అవుతుంటే సపోర్ట్ చేయలేదు. కనీసం కన్న తండ్రివి నువ్వైనా ఉండాలి కదా..నువ్వే నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో నిలబడే రోజు వస్తుంది..అంటూ దుమ్ము దులిపేశాడు. ఆ దెబ్బతో పాన్ ఇండియన్ స్టార్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా పలువురు స్టార్స్ బండ్లన్న కామెంట్స్ తర్వాత రియాక్ట్ అవుతున్నారు. ఆకాష్ సినిమాకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విషెస్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. దాంతో బండ్లన్నా మజాకా..పూరి కొడుకోసం మొత్తం ఇండస్ట్రీనే కదిలించాడని మాట్లాడుకుంటున్నారు. నిజంగా నిన్నటిరోజున బండ్ల గణేష్ మాట్లాడిన వాటిలో ఏ ఒక్కటీ తప్పు అని ఎవరూ నెగిటివ్‌గా కామెంట్స్ చేయడంలేదు.
uffff .. what to say .. this is so gratifying .. my love and respect .. ❤️❤️❤️🙏🙏🙏 https://t.co/5X0BRlVRgK
— Amitabh Bachchan (@SrBachchan) June 23, 2022