Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాతల్లో బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి ఒక చిన్న నటుడిగా వచ్చి ఆ తర్వాత హీరో పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసుకుంటూ బండ్ల గణేష్ ఎదిగారు. ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో తన మాటలతో చాలా ఫేమస్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా బండ్ల గణేష్ పలు కీలక విషయాలను వెల్లడించారు.
సాధారణంగా తనకు కోపం వస్తే మాటలు జారిపోతాయని, ఆ తర్వాత అలా అనకుండా ఉండుంటే బావుండదని అనకు అనిపిస్తుందని బండ్ల గణేష్ అన్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను విపరీతంగా పొగిడారు. అలాగే ఏపీ మంత్రి రోజా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే తన కులాన్ని ఎవరైనా దూషిస్తే మాత్రం ఊరుకునేది లేదని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు. ఆంధ్ర రాజకీయాలంటే రోత రాజకీయం అని, తాను విజయ్ సాయి రెడ్డి మీదనే స్పందించానుగానీ ఇంకెవరి గురించి మాట్లాడలేదని తెలిపారు. అలా విజయ్ సాయి రెడ్డి గురించి మాట్లాడినందుకు మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి ఏపీ రాజకీయాలు నీకెందుకురా అని కేకలేశారని బండ్ల గణేష్ వివరించారు.
తాను హైదరాబాద్‌లో పుట్టానని, ఏపీ రాజకీయాలు మాట్లాడ్డం అంత అవసరం లేదని కొన్ని సార్లు అనిపించిందని, బొత్స కూడా ఫోన్లో ఫైర్ అవడంతో వాటిని వదిలేశానని తెలిపారు. ఏపీలో వై.వి.సుబ్బారెడ్డి, బాలినేని, అమర్‌నాథ్ వంటి వారు తనకు ఆప్తులుగా ఉన్నారన్నారు. ఒకప్పుడు వారిని కలుస్తూ ఉండేవాడినని, రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు సరిగా కలవడం లేదని తెలిపారు.
Bandla Ganesh:
తాను ఎవరైనా కమ్మ కులాన్ని తిడితే కచ్చితంగా రియాక్ట్ అవుతానని బండ్ల గణేష్ తెలిపారు. అవతలి వాడి క్యారెక్టర్‌ను తిట్టడం వల్ల తనకు అభ్యంతరం ఏమీ లేదని, కానీ తన కులాన్ని తిట్టడం మాత్రం తాను తట్టుకోలేనని అన్నారు. తాను ఎవ్వరికీ వార్నింగులు ఇవ్వడం లేదని, కేవలం సలహా మాత్రం ఇస్తున్నానని అన్నారు. తన మంచితనం ఏ రేంజ్ లో ఉంటుందో తన చెడ్డ తనం కూడా అదే రేంజ్ లో ఉంటుందని బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.