రిలీజ్ డేట్: 14 జూలై 2023
నటినటులు: నీరోజ్ పుచ్చా, సుభారంజన్, సోనమ్ టెండప్, సమైరా సందు, పెడెన్ నాంగ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి, మహేందర్ బర్కాస్ తదితరులు
డైరెక్టర్: దీనరాజ్
నిర్మాతలు: శంకర్ నాయుడు అడుసుమిల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : సత్య కశ్యప్, కపిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల
డైరెక్టర్ దీనరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా భారతీయన్స్. ఈ సినిమా దేశభక్తి కథ నేపథ్యంలో రూపొందింది. ఇప్పటికే ఎన్నో దేశభక్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా ఆకట్టుకున్నాయి. ఇక అందులో ఒకటి ఈ భారతీయన్స్. ఇక దీన రాజ్ ఇంతకుముందు రచయితగా చేయగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇందులో నీరోజ్ పుచ్చా, సుభారంజన్, సోనమ్ టెండప్, సమైరా సందు, పెడెన్ నాంగ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి, మహేందర్ బర్కాస్ తదితరులు నటించారు. ఈ సినిమాను భారత్ అమెరికన్ క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. సత్య కశ్యప్, కపిల్ కుమార్ సంగీతం అందించారు. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.
కథ: కథ విషయానికి వస్తే ఈ సినిమా భారత దేశంలోని ఆరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ ఆరుగురిలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు. అలా వాళ్ళు తెలుగు, భోజ్ పురి, నేపాలి, పంజాబీ, బెంగాలీ, త్రిపురకు చెందినవాళ్లు. ఇక ఈ ఆరుగురికి దేశభక్తి అంటే చాలా ఎక్కువ. అయితే ఓసారి ఈ ఆరుగురిని కొన్ని వేరువేరు సమస్యలు వెంటాడుతాయి. ఇక ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారికి కొందరి అజ్ఞాత వ్యక్తుల నుంచి పిలుపు వస్తుంది. ఇక ఆ వ్యక్తులు మీ సమస్యలను తొలగించడమే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా తోడుగా ఉంటాము అని ధైర్యం ఇస్తారు. కానీ దాని కోసం ఒక పని చేయాలి అని అడుగుతారు. మీకున్న దేశభక్తితోనే ఒక సీక్రెట్ విషయం కోసం మీరు బార్డర్ దాటి చైనాకి చేరుకోవాల్సి వస్తుంది అని అంటారు. అలా వీరు ఆ అజ్ణాత వ్యక్తుల మాటలు వింటారా.. ఇంతకు ఆ సీక్రెట్ మిషన్ ఏంటి.. ఆరుగురికి చుట్టుముట్టిన సమస్యలు ఏంటి.. చివరికి వీళ్లంతా అజ్ఞాత వ్యక్తులు చెప్పిన సీక్రెట్ మిషన్ ను సక్సెస్ చేస్తారా లేదా అనేది మిగిలిన కథలోనిది.
Bharateeyans telugu movie
ప్లస్ పాయింట్స్: కథ, కొన్ని సన్నివేశాలు, ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్: నటీనటులు ఇంకాస్త పర్ఫామెన్స్ చేస్తే బాగుండేది.
సాంకేతిక విభాగం: తొలిసారిగా డైరెక్టర్గా పరిచయమైన దినరాజ్ ఈ సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి బాగా ప్రయత్నించాడు. సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉంది. మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
చివరి మాట: చివరగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా తమకున్న దేశభక్తి ఆ ఆరుగురు వ్యక్తులు ఎలా చూపించారో అనేది ప్రతి ఒక్కరిని కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా చూడాల్సిందే.
రేటింగ్: 3.25