Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాను మలయాళం హిట్ చిత్రం అయ్యపనుం కోషియుం కి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తెలుగు వెర్షన్‌కు స్క్రీన్ ప్లే తో పాటుగా డైలాగ్స్ అందించారు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం షాకివ్వకపోతే లాభాలను చూసేది.
కానీ, అక్కడ పవన్ సినిమాకు టికెట్ రేట్లు భారీగా తగ్గించడం, థియేటర్స్‌లో అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ వసూళ్ళ పరంగా గట్టి దెబ్బపడింది. మిగిలిన అన్నీ చోట్లా భీమ్లా నాయక్ సినిమాకు మంచి వసూళ్ళు వచ్చాయి. ఆ మూవ్‌మెంట్‌లో ఈ సినిమాకు వచ్చిన హైప్ చూసి భారీ హిట్ అనుకున్నారు అందరూ. కానీ, ఫైనల్‌గా దాదాపు 4 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఇక ఈ నష్టానికి కారణం రీ షూట్ కూడా ఒకటి. దాదాపు 40 రోజులు రీ షూట్ చేయడం వల్ల బడ్జెట్ కూడా అనుకున్నదానికంటే బాగా ఎక్కువగా పెరిగిపోయింది.
Bheemla Nayak: ఇంత దారుణమైన రేటింగ్..?
దానివల్ల కూడా భీమ్లా నాయక్ చిత్రానికి నష్టాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయింది. కానీ, ఇప్పటివరకు పవన్ నటించిన ఏ ఫ్లాప్ సినిమాకు కూడా రానంత వరస్ట్ రేటింగ్ నమోదవడం షాకింగ్ విషయం. ఈ మధ్య కాలంలో 10 రేటింగ్ వచ్చిన సినిమా ఏదీ లేది. కానీ, భీమ్లా నాయక్ సినిమాకు 10 కూడా రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇది పవన్ ఫ్యాన్స్‌కు కాస్త రగిలే విషయం. అయితే, దీనికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి ఐపిఎల్ ప్రభావం గట్టిగా పడింది. దీనివల్ల ఆల్రెడీ ఆహా, అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ కావడంతో అందరూ చూసేశారు. ఇది రెండవది. అందుకే భీమ్లా నాయక్ సినిమాకు ఇంత దారుణమైన రేటింగ్ వచ్చి ఉండొచ్చుననే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.