Bhuma Mounika: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నటువంటి వారిలో భూమా మౌనిక మంచు మనోజ్ జంట ఒకటి.వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటూ రహస్యంగా వీరి రిలేషన్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం పోరాటం చేసిన ఈ జంట చివరికి తమ ప్రేమను గెలిపించుకొని పెళ్లి బంధంతో ఒకటయ్యారు.మార్చి మూడవ తేదీ ఈ జంట అతి తక్కువ మంది సమక్షంలో తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.
ఇలా భూమా మౌనికను పెళ్లి చేసుకున్నటువంటి మనోజ్ జీవితంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పెళ్లి అయిన వెంటనే ఈ దంపతులు పలు ఆలయాలను సందర్శించిన అనంతరం నూతన గృహప్రవేశం చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో భాగంగా భూమా మౌనిక వీపుపై ఉన్నటువంటి సీక్రెట్ టాటు బయటపడటంతో ఒక్కసారిగా మంచు మనోజ్ ఈ టాటూ చూసి షాక్ అవ్వడమే కాకుండా భూమా మౌనికపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయ్యాయి.
Bhuma Mounika: మౌనిక టాటూ సీక్రెట్ ఇదేనా….
ఇంతకీ భూమా మౌనిక వీపుపై ఉన్నటువంటి ఆ టాటూ ఏంటి అనే విషయానికి వస్తే… భూమా మౌనిక మంచు మనోజ్ కన్నా ముందుగా ప్రముఖ బిజినెస్ మెన్ గణేష్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఇలా కుమారుడు జన్మించిన తర్వాత పలు మనస్పర్ధలు కారణంతో భూమ మౌనిక అతని నుంచి విడాకులు తీసుకొని విడిపోయింది. అయితే తనని పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరుతో ఈమె వీపుపై టాటూ వేయించుకున్నారు అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న అటాటు అలాగే ఉండడంతో ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఇది చూసే మనోజ్ కోపడ్డారనే వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని, మౌనిక గురించి అన్ని తెలిసే మనోజ్ పెళ్లి చేసుకున్నారన్న వాస్తవం అందరికీ తెలిసిందే.