Bhuma Mounika Reddy: చాలా రోజుల దాగుడుమూతన తర్వాత ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు మౌనిక, మనోజ్. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ టాపికే నడుస్తుంది. నెట్టింట్లో కూడా పెళ్లి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లి నుంచి భూమా మౌనిక రెడ్డి ఆస్తుల మీదికి మళ్ళింది. ఇప్పుడు తాజాగా ఆకర్షిస్తున్న విషయం ఆమె ఆస్తులు చిట్టా.
ఆమెకి ఉన్న ఆస్తులు చూసి నోరెళ్ల బెడుతున్నారు నెటిజన్స్. భూమా మౌనిక రెడ్డికి.. గణేష్ రెడ్డి అనే వ్యక్తితో ముందే వివాహం జరిగింది. ఆమెకి ధైరవ్ రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అనుకోని కారణాల వలన ఆమె మొదటి భర్తకి విడాకులు ఇవ్వవలసి వచ్చింది. అందుకు భరణంగా మొదటి భర్త నుంచి 250 కోట్ల ఆస్తి సంక్రమించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అది కాకుండా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి, ఇతర మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తి చూసినట్లయితే ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న ఆస్తి రెండువేల కోట్ల పై మాటే అని బోగట్టా. ఈమె తండ్రి రాజకీయ నాయకుడు కావడం.. వాళ్లు కూడా రాజకీయాల్లో బాగా సంపాదించడం వల్ల ఈమెకి వారసత్వంగా ఆస్తి ఎక్కువ మొత్తంలో సంక్రమించింది.
Bhuma Mounika Reddy:
ఈమె పేరు మీద ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె పేరు మీద ఆస్తులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. ఇక గతంలో రెండో పెళ్లి గురించి ఎన్నిసార్లు ప్రస్తావించిన కొట్టి పారేశారు భూమిక, మనోజ్. కెరియర్ విషయంలో ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్టు చేసుకోనున్నారని తెలుస్తోంది. మనోజ్ తన దృష్టిని సినిమాల మీద కేంద్రీకరించగా మౌనిక మాత్రం రాజకీయాల మీద దృష్టిని కేంద్రీకరించింది. ఈ వివాహం అనంతరం భూమా మౌనికకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది.